బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబాలకృష్ణ హెల్త్ బులెటిన్

4 గంటల క్రితం

balakrishna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

షూటింగ్‌లో గాయపడిన నటుడు బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆ ఆసుపత్రి వైద్య బృందం బుధవారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడం, వాపు వంటి లక్షణాలు కనిపించాయి. ఈ పరిస్థితిని బట్టి చూస్తే కండరాల చీలిక (మజిల్ టియర్) ఉండే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ‘ప్రస్తుతం ఆర్థోపెడిక్ నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది. అన్ని టెస్ట్‌లూ పరిశీలించిన తర్వాత ఆపరేషన్ గురించి పరిశీలిస్తాం’ అని వైద్యులు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్