‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా పరిచయమైన మౌళి నటించిన తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. బెట్టింగులకు అలవాటుపడిన ఓ యువకుడు డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడటం, పెద్ద మొత్తంలో బంగారాన్ని దొంగిలించిన తర్వాత అతడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ వెల్లడిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.








కామెంట్‌లు (0)