విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కల్ట్’. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం ఆవిష్కరించింది. స్లాషర్ చిత్రంగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. ఇందులో మురళీ శర్మ రాజకీయ నాయకుడిగా, శ్రీకాంత్ అయ్యంగార్ సీనియర్ పోలీసు అధికారిగా నటించారు. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కకరాల నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించగా, తరుణ్ భాస్కర్ సంభాషణలు రాశారు.
‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 07:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)