మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionట్రోల్స్‌‌పై స్పందించకండి : అల్లు అర్జున్‌

53 నిమిషాల క్రితం

Allu-ARjun
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 09:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై అభిమానులు స్పందించకండి అని హీరో అల్లు అర్జున్‌ హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన ఓ హోటల్‌లో తన అభిమానులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈరోజు నేను ఇక్కడ మిమ్మల్ని కలవడం చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీలో ఉన్న ఆ ఉత్సాహాన్ని ఎప్పటికీ పోనీయకండి. నా అభిమానులకే కాదు.. నన్ను ద్వేషించే వారికీ ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒకరిపై విమర్శలు చేయకండి. మనకు నచ్చని వాళ్ల కోసం మన డబ్బును ఖర్చు పెడతామా? లేదు కదా! అలాగే, వారి కోసం మన సమయం, శక్తి ఎందుకు ఖర్చు చేయాలి? సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై స్పందించడం కంటే ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి. మీకు నచ్చిన పని చేయండి. ప్రతి మనిషికి ఒక రోజులో 100 శాతం సమయం, శక్తి ఉంటే, దాన్ని దేనికి వినియోగిస్తారనేదే ముఖ్యం’’ అని అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు. బన్నీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్