హీరో శరణ్ నటిస్తున్న మూవీ 'ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్స్'. చిత్రబృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. పోర్టు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను పట్టుకోవడానికి కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు వేసే ప్రణాళికలు, వాటిని చిత్తు చేయడానికి స్మగ్లింగ్ గ్యాంగ్ చేసే ప్రయత్నాల నేపథ్యంలో దర్శకుడు సమయ మురళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, జె.డి. చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు లాల్‌తో పాటు స్నేహా, కాళీ వెంకట్, బాలా శరవణన్, జాఫర్ సాదిక్, వినోదిని, మైమ్ గోపి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Print Editionఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్స్ పోస్టర్
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 16, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)