గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడిసెంబర్ 3న 'ఫౌజీ' రిలీజ్

4 గంటల క్రితం

fauzi movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తున్న 'ఫౌజీ' చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్