సుమంత్ ప్రభాస్, అనంతిక సునీల్ కుమార్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ‘గడియారాలు లేని సమయాలు.. కొలమానం లేని సరదాలు.. అంతా మనకు సొంతాలు.. ఇలా మొదలైందే రోమాంచకం’ అంటూ సాగే ఈ పాటను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రత్యేకంగా తెరకెక్కించారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది.
‘గడియారాలు లేని సమయాలు’
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)