ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను హీరో సూర్యతో చేయాల్సిన సినిమా ఇది కాదు. మొదట నేను ఆయనతో ఓ బయోపిక్ చేయాలని అనుకున్నాను. ఆ కథ కూడా వినిపించాను. ఆయనకు నచ్చింది. కానీ అప్పటికే సూర్య రెండు బయోపిక్‌లలో నటించారు. మరోసారి బయోపిక్ అంటే సరైనది కాదు. వేరే కథ ఉంటే చెప్పు, కచ్చితంగా చేద్దాం అన్నారు. దాంతో 40 ఏళ్ల వయసున్న, పిల్లలు ఉన్న వ్యక్తికి.. 20 ఏళ్ల యువతికి మధ్య ఉండే బంధం, భావోద్వేగాల నేపథ్యంలో సాగే 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథ చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది’ అని వెంకీ అట్లూరి తెలిపారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా మమిత బైజు నటిస్తున్నారు.
Print Editionసూర్యతో అనుకున్న సినిమా ఇది కాదు : వెంకీ అట్లూరి
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)