హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కరికాల’. ఈ మూవీ పోస్టర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్లు ప్రకటించింది. ‘కరికాల – చాప్టర్ 1’ను 2027 జూలై 2న, ‘కరికాల – చాప్టర్ 2’ను అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే రెండు భాగాలను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.
Print Editionరెండు భాగాలుగా ‘కరికాల’
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)