కిషోర్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వి.వి. వినాయక్, హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దివాకర్ యడ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథానాయకుడిగా, ‘కేజీఎఫ్’లో యశ్ తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న అర్చనా జోయస్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రేమను హృదయానికి హత్తుకునేలా చూపించడమే తమ ప్రయత్నమని దర్శకుడు తెలిపారు. చిత్ర టైటిల్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు మల్కాపురం శివకుమార్, సిద్ధు రెడ్డి తెలిపారు.
కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 07:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)