హీరో అఖిల్ నటించిన ‘లెనిన్’, తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ‘ఓ సుకుమారి’ చిత్రాలు ఆగస్టు 7 నుంచి ఓటీటీలోకి రానున్నాయి. ‘లెనిన్’ జీ5లో, ‘ఓ సుకుమారి’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నాయి. ‘ఓ సుకుమారి’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ‘ఓ సుకుమారి’ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూలై 17న థియేటర్లలో విడుదలైంది. ‘లెనిన్’ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించారు. అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించగా, మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నెల రోజుల్లోనే ఈ రెండు చిత్రాలు ఓటీటీ వేదికల్లోకి వస్తున్నాయి.
ఓటీటీలోకి ‘లెనిన్’, ‘ఓ సుకుమారి’
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)