సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచివరి దశ షూటింగ్‌లో 'మహాకాళి'

14 జులై, 2026

Mahankhali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 08:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దర్శకుడు ప్రశాంత్ వర్మ సినీ విశ్వంలో భాగంగా రూపొందుతున్న చిత్రం 'మహాకాళి'. ఇప్పటికే 125 రోజుల చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉందని చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించింది. పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అక్షయ్ ఖన్నా, రోహిత్ షరాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రయూనిట్ వెల్లడించింది. ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి దృశ్యానుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని భారీ తెర ప్రదర్శనకు అనువైన ప్రత్యేక సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్