ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ & కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాతగా, వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మిస్సింగ్ మేఘన'. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను దర్శకుడు వి.వి. వినాయక్ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం హీరో రామ్ కార్తీక్, దర్శకుడు వాచస్పతి, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, వి.వి. వినాయక్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇది సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని, ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయని చెప్పారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, చిత్రంలో అవకాశం కల్పించిన దర్శకుడు వాచస్పతి, నిర్మాత పంచుమర్తి నరేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉందని, ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Print Edition'మిస్సింగ్ మేఘన' మూవీ పోస్టర్ ఆవిష్కరణ
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)