సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఫౌజీ’ టీజర్‌పై నేతాజీ మనవడి అభ్యంతరం

2 గంటల క్రితం

‘ఫౌజీ’ టీజర్‌పై నేతాజీ మనవడి అభ్యంతరం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 07:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఫైల్‌ నంబర్‌ 25’ టీజర్‌లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను చూపించిన తీరుపై ఆయన మనవడు చంద్రకుమార్‌ బోస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించేలా చిత్రీకరించినందుకు దర్శకుడు భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 1942లో బెర్లిన్‌లో నేతాజీ, జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ సమావేశమైన చారిత్రక ఘటనను ఈ టీజర్‌లో చూపించారు. అయితే ఆ సందర్భంలో ప్రభాస్‌ పోషిస్తున్న కల్పిత గూఢచారి పాత్ర ప్రతిభను నేతాజీ హిట్లర్‌కు వివరిస్తున్నట్లు చిత్రీకరించారు. నేతాజీతో కల్పిత పాత్రను ప్రశంసింపజేసి, సినిమా హీరోను ఉన్నతంగా చూపించడం సరికాదన్నది చంద్రకుమార్‌ బోస్‌ అభ్యంతరం. నేతాజీని చారిత్రక వాస్తవాలకు విరుద్ధంగా చిత్రీకరించడం ఆయన స్థాయిని తగ్గించడమేనని పేర్కొన్నారు. చారిత్రక వ్యక్తుల జీవితాలు, ఘటనలను సినిమాల్లో చూపేటప్పుడు వాస్తవాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని బోస్‌ కోరారు. వివాదాస్పద టీజర్‌ను ఉపసంహరించుకుని, కొత్త టీజర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్