హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మైథలాజికల్ ఎపిక్‌కు ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు ‘దేవసేనాపతి’ అనే మరో టైటిల్‌ను కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఈ రెండు టైటిళ్లలో ఏదో ఒకదాన్ని చిత్రానికి ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే చిత్ర టైటిల్‌పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
‘దేవసేనాపతి’గా ఎన్టీఆర్?
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)