‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మౌళి నటించిన తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం ‘ఓ మై గాడ్ ఎవరే ఈ బ్యూటీ దూసుకెళ్లిపోతుందే హార్ట్‌లోకి’ పాటను విడుదల చేసింది. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల ఆలపించారు. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు.
ఓ మై గాడ్ ఎవరే ఈ బ్యూటీ ...
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 28, 2026, 08:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)