గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు నెలరోజుల విరామం

5 గంటల క్రితం

Prabhas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌కు నెలరోజుల విరామం ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రీకరణ మాత్రం శరవేగంగా కొనసాగుతోంది. ‘స్పిరిట్‌’ షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చినప్పటికీ, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ఎడిటింగ్‌, సంగీతం, ఇతర పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులపై దృష్టి సారించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు సమీపిస్తుండటంతో, వాటిని నిర్ణీత సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై చిత్రబృందాలు దృష్టి పెట్టాయి. ‘ఫౌజీ’ చిత్రం డిసెంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ప్రభాస్‌ సైనికుడి పాత్రలో నటిస్తుండగా, ఇమాన్వీ ఇస్మాయిల్‌ కథానాయికగా కనిపించనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్