గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘పాంచాలి పంచభర్తృక’

5 గంటల క్రితం

rajendra-prasad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పాంచాలి పంచభర్తృక’. గంగ సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసిన మేకర్స్‌, ‘నవ్వులు, ఆశ్చర్యకరమైన మలుపులు, అంతులేని వినోదంతో కూడిన అద్భుతమైన అనుభూతికి సిద్ధంగా ఉండండి’ అంటూ పేర్కొన్నారు. ఈ సినిమా గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ‘చాలా కాలం తర్వాత నాలోని పాత రాజేంద్ర ప్రసాద్‌ను గుర్తు చేసే పాత్ర దొరికింది. పాటలు, ఫైట్లు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఈ పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసే ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్