సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ విడుదలపై వస్తున్న సందేహాలకు చిత్రబృందం తెరదించింది. సినిమా ముందుగా ప్రకటించినట్టే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఇటీవల విడుదల తేదీ మారుతుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌వీసీ63 కూడా ఇదే సమయంలో విడుదల కానుందని ప్రచారం జరిగింది. ‘స్పిరిట్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో విడుదల వాయిదా పడుతుందనే వార్తలు కూడా వచ్చాయి. ప్రభాస్ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ కథానాయిక. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానుంది.
మార్చి 5న ప్రభాస్ ‘స్పిరిట్’
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)