విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 11న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని తాజాగా వాయిదా వేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ కత్తి చేతబట్టి యోధుడి లుక్‌లో కనిపించారు. రష్మిక ‘జయమ్మ’ పాత్రలో నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనున్నారు.
అక్టోబర్ 16న ‘రణబాలి’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)