గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సెప్టెంబర్‌ 4న ‘సహ’ విడుదల

1 గంట క్రితం

saha_V_jpg--816x480-4g.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టాలీవుడ్‌లో మరో విభిన్నమైన ప్రేమకథా చిత్రం ‘సహ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యువ నటులు శివకుమార్‌ కాసారం, శ్వేతా లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న థియేటర్లలో విడుదల కానుంది. నిశాంత్‌ దోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తేజేశ్వర్‌ వేల్పుచర్ల నిర్మించారు. సంజు అనే యువకుడి తొలి ప్రేమ, బ్రేకప్‌, ఉద్యోగం, జీవిత ప్రయాణం నేపథ్యంలో కథ సాగుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని సంయుక్తంగా విడుదల చేస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్