ఏడుగురు మహిళల జీవితాల నేపథ్యంలో దర్శకుడు అభిరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఈ చిత్రం నుంచి ‘సీతాకోకలా..’ అనే పాటను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. గాయని చిన్మయి శ్రీపాద ఆలపించిన ఈ పాటకు సురేష్ బానిసెట్టి సాహిత్యం అందించారు. చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటించగా, పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Print Edition'సీతాకోకలా...' పాట విడుదల
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)