కోలీవుడ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిగ్మా’. ఈ మూవీ విడుదల పలుమార్లు వాయిదా పడినా.. ఎట్టకేలకు చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం తాజాగా వెల్లడించింది. ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 2న ‘సిగ్మా’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 06:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)