టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్'. సోమవారం పూరిజగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ తో ప్రముఖ నటి జరీనా వహబ్ పాత్రను మేకర్స్ రిలీజ్ చేశారు. డైలాగ్స్ లో పూరీ మార్క్ కనిపిస్తోంది. ఇందులో హీరోయిన్ గా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. కీలక పాత్రలో టబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ రమీ సంగీతం అందిస్తున్నాడు. నటి ఛార్మి కౌర్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మూవీ విడుదల కానుంది.
'స్లమ్‌డాగ్ గ్లింప్స్ విడుదల
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)