ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ సాత్విక వీరవల్లి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ పుట్టినరోజు (జూలై 28) సందర్భంగా ఈ చిత్రం నుంచి పోస్టర్‌ను, ‘చిట్టి చిట్టి చీమ’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో దుల్కర్ ‘కృష్ణ’ పాత్రలో నటిస్తున్నారు. ఆకాశంలోకి, అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనే ఒక గ్రామీణ అమ్మాయి కథాంశంతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ పవన్ సాధినేని తెరకెక్కిస్తున్నారు. సందీప్, రమ్య గున్నం లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది.
Print Edition‘ఆకాశంలో ఒక తార’ నుంచి సాంగ్, పోస్టర్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)