బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మిస్సింగ్‌ మేఘన’ నుంచి ‘పిల్ల పిల్ల పిల్ల’ పాట

3 గంటల క్రితం

movie.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 08:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘మిస్సింగ్‌ మేఘన’ చిత్రం నుంచి ‘పిల్ల పిల్ల పిల్ల’ తొలి పాటను ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తాజాగా విడుదల చేశారు. వాచస్పతి దర్శకత్వంలో పంచుమర్తి నరేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌.ఆర్‌. ధృవన్‌ సంగీతం అందించడంతోపాటు పాటను రచించగా, జావేద్‌ అలీ ఆలపించారు. శామ్‌ కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ రివీలింగ్‌ పోస్టర్‌ను దర్శకుడు వి.వి. వినాయక్‌ ఆవిష్కరించారు. బెక్కం వేణుగోపాల్‌ ఈ చిత్ర బృందానికి మద్దతు అందిస్తున్నారు. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్