బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్–2026'లో ఆయనను 'విశిష్ట కళాకారుడి' పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పంకజ్ త్రిపాఠి స్పందిస్తూ.. ‘‘కథలకు హద్దులు ఉండవు. కథ నచ్చితే భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. బిహార్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన నేను, నా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయని ఎప్పుడూ ఊహించలేదు. నా సినీ ప్రయాణంలో తోడుగా నిలిచిన దర్శకులు, రచయితలు, తోటి నటులు, సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. పంకజ్ త్రిపాఠి నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఐఎఫ్‌ఎఫ్‌ఎం డైరెక్టర్ మితూ బౌమిక్ లాంగే కొనియాడారు. ‘‘ఆయన ప్రతి పాత్రకు ప్రాణం పోస్తారు. సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి దేశంలోని గొప్ప నటుల్లో ఒకరిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. అలాంటి నటుడిని సత్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని ఆమె అన్నారు. కాగా, 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్–2026' ఆగస్టు 13 నుంచి 23 వరకు మెల్‌బోర్న్‌లోని పలైస్ థియేటర్‌లో జరగనుంది.
Print Editionపంకజ్ త్రిపాఠికి విశిష్ట గౌరవం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 08:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)