సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలిస్టింగ్ రోజే 500 శాతం లాభాలు

49 నిమిషాల క్రితం

CXMT
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చైనా చిప్‌ కంపెనీ సిఎక్స్‌ఎంటి రికార్డ్‌

బీజింగ్‌ : ఎఐ బూమ్‌తో సెమీకండక్టర్ రంగానికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మెమొరీ చిప్‌ తయారీ కంపెనీ చాంగ్‌క్సిన్ మెమొరీ టెక్నాలజీస్ (సిఎక్స్‌ఎంటి) ఐపిఒ లిస్టింగ్‌ ‌రోజే 500 శాతానికి పైగా లాభాలను అందించింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీలో సోమవారం ప్రవేశించిన తొలిరోజే వాటాదారులకు కాసుల వర్షం కురిపించి రికార్డ్‌ లాభాలను ఆర్జించింది. ఈ ఇష్యూ ద్వారా 57.9 బిలియన్‌ యువాన్ల (సుమారు రూ.82 వేల కోట్లు) నిధులను సమీకరించి ఆసియాలోనే అతిపెద్ద ఐపిఒగా నిలిచింది. ఈ కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో రూ.8.66 నుంచి ఏకంగా 49.50 యువాన్లకు ఎగబాకడంతో మార్కెట్ విలువ 3.56 ట్రిలియన్‌ యువాన్లకు చేరింది. అమెరికా ఆంక్షల నడుమ చైనా స్వయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రపంచ ‌డిఆర్‌ఎఎం మార్కెట్‌లో 8 శాతం వాటాతో నాలుగో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న సిఎక్స్‌ఎంటి ఈ రికార్డు విజయాన్ని నమోదు చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్