ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు ‘సమ్మర్‌ హాలిడేస్‌’ విడుదల

2 రోజుల క్రితం

నేడు ‘సమ్మర్‌ హాలిడేస్‌’ విడుదల.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 05:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బాల్య జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహాలు, అనుభూతుల నేపథ్యంలో రూపొందిన ‘సమ్మర్‌ హాలిడేస్‌’ చిత్రం నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించింది. ఈ సందర్భంగా ఇందులో నటించిన రోహన్‌ రాయ్‌, అరుణ్‌ గురువారం మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్‌ ఇందులో ఆర్‌.వి. అనే ప్రశాంతమైన కుర్రాడి పాత్ర పోషించారు. కె.వి. పరిచయంతో అతడి జీవితంలో వచ్చే మార్పులు ఆసక్తికరంగా ఉంటాయని తెలిపారు. సీనియర్‌ నటి జయసుధతో కలిసి నటించడం మంచి అనుభూతినిచ్చిందన్నారు. పదో తరగతి చదువుతున్న రోహన్‌ రాయ్‌ కె.వి. పాత్రలో కనిపించనున్నారు. ఎన్నో అవమానాలు ఎదురైనా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ, కుటుంబం కోసం కష్టపడే ఎనర్జిటిక్‌ కుర్రాడిగా నటించానని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్