ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విలన్‌గా తరుణ్‌ భాస్కర్‌

3 రోజుల క్రితం

విలన్‌గా తరుణ్‌ భాస్కర్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 07:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్‌ ఇప్పుడు తమిళ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రదీప్‌ రంగనాథన్‌, మమితా బైజు జంటగా నటిస్తున్న ఓ చిత్రంలో ఆయన విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. తొలుత ఈ పాత్రకు దర్శకుడు, నటుడు అశ్వత్‌ మారిముత్తును ఎంపిక చేసినప్పటికీ, రజనీకాంత్‌తో ‘ధర్మన్‌’ చిత్ర పనుల్లో బిజీగా ఉండటంతో ఆయన స్థానంలో తరుణ్‌ భాస్కర్‌ను తీసుకున్నట్లు సమాచారం. ప్రదీప్‌ రంగనాథనే ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు తన సొంత నిర్మాణ సంస్థ ‘పీఆర్‌ షో’ పతాకంపై నిర్మిస్తున్నారు. ‘ది ఆల్ఫా యూనిట్‌’ పేరుతో ఆరుగురు యువ దర్శకులు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం #PRS01 అనే వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్