మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరుముడి కథ వెనుక ఆలోచన ఇదే!

4 గంటల క్రితం

shiva nirvana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తాగుబోతు భర్త, కూతురి కోసం ఏదైనా చేయగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి కథతో ‘ఇరుముడి’ చిత్రం రూపొందింది. అయ్యప్ప మాలలు వేసుకున్న కొందరు భక్తులు నియమాలను మధ్యలోనే వదిలేయడం గమనించి ఈ కథ రాసుకున్నానని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. ‘తాగుబోతు తండ్రికి కుమార్తె అంటే వల్లమాలిన ప్రేమ, చుట్టుపక్కల అన్యాయం జరిగితే సహించని స్వభావం ఉన్న పాత్రను రవితేజకు చెప్పగానే ఆయన అంగీకరించారు. ‘విక్రమార్కుడు’లోనూ చైల్డ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’లో దాని నేపథ్యం భిన్నంగా ఉంటుంది. ట్రైలర్‌లో చూపించినట్లుగా రవితేజ తాగుబోతు, ఆటో డ్రైవర్‌గా కనిపిస్తారు. అయితే ఆయన పాత్ర అంతకుమించి ఉంటుంది’ అని చెప్పారు. ప్రీరిలీజ్‌ కార్యక్రమంలో రవితేజ చైల్డ్ ఆర్టిస్ట్‌ను ప్రేమగా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యను సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు ఎక్కువగా ప్రచారం చేశాయని, ఆ మాటను సరదాగా ఉపయోగించినదేనని ఆయన వివరించారు. ఈ చిత్రం ఈ నెల 21న థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్