మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనంద కిషోర్ దర్శకత్వంలో ...

2 గంటల క్రితం

vishwak-sen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘35 చిన్న కథ కాదు’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘కల్ట్’ అనే సరికొత్త స్లాషర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్