అక్కినేని నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ నుంచి తొలి పాట విడుదలకు సిద్ధమైంది. ‘స్వాగ్ ఆఫ్ అర్జున’ పేరుతో సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను నవంబరు 7న విడుదల చేయనున్నట్లు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సంగీత దర్శకుడు అజనీష్ బి. లోక్‌నాథ్ ఈ చిత్రం కోసం అద్భుతమైన సంగీతం అందించారని, మాస్, క్లాస్ మేళవింపుతో రూపొందిన ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబరు 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
7న ‘వృషకర్మ’ ఫస్ట్ సింగిల్
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)