బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.5 కోట్లు ఇవ్వ‌కుంటే లేపేస్తాం..

9 గంటల క్రితం

| రూ.5 కోట్లు ఇవ్వ‌కుంటే లేపేస్తాం.. 
బాలీవుడ్ న‌టుడు తుషార్‌కపూర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 02:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- బాలీవుడ్ న‌టుడు తుషార్‌కపూర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

ముంబై : ఇటీవ‌ల బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ పై, అంతకుముందు సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పులు జరిపిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ తాజాగా మరో నటుడిని బెదిరించింది. తాజాగా బాలీవుడ్‌ నటుడు తుషార్ కపూర్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యులు బెదిరించారు. లారెన్స్‌ గ్యాంగ్‌ సభ్యుడు ‘హ్యారీ బాక్సర్’ పేరిట ఓ వ్యక్తి నుంచి తుషార్ క‌పూర్‌కు ఫోన్ కాల్‌ వచ్చింది. తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని లేదంటే హత్య చేస్తామని ఫోన్‌చేసిన వ్య‌క్తి బెదిరింపులకు దిగాడు. అప్రమత్తమైన తుషార్ కపూర్‌ వెంటనే ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుషార్ కపూర్‌ వారం ముందే తమకు ఫిర్యాదు చేశాడ‌ని, భద్రతాకారణాల దృష్ట్యా ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. తుషార్ కపూర్‌ 30కి పైగా బాలీవుడ్‌ సినిమాల్లో నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యహరించారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సోద‌రుడే తుషార్ క‌పూర్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్