ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశీతాకాలంలో అప్రమత్తత ఇలా...

1 రోజు క్రితం

శీతాకాలంలో అప్రమత్తత ఇలా... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 04:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శీతాకాలంలో దగ్గు, గొంతులో మంట, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి. చల్లని వాతావరణంతోపాటు గాలి కాలుష్యం, ధూళి, పొగ, వైరల్‌ ఇన్ఫెక్షన్లు కూడా వీటికి కారణమవుతాయి. ముఖ్యంగా ఆస్తమా, అలర్జీలు, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఆరుబయట తిరగడం తగ్గించాలి. నిర్మాణ పనులు జరిగే ప్రాంతాలు, వాహనాల పొగ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.

  • తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించాలి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపకుండా జాగ్రత్తపడాలి.

  • ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, బూజు, సిగరెట్‌ పొగ, అగరబత్తుల పొగ వంటి వాటికి దూరంగా ఉండాలి. బయట గాలి నాణ్యత మెరుగ్గా ఉన్నప్పుడు కిటికీలు తెరిచి గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి.

  • దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్నవారితో సన్నిహితంగా ఉండకుండా జాగ్రత్తపడాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి అడ్డంగా రుమాలు లేదా టిష్యూ పెట్టుకోవాలి.

  • ఆస్తమా, అలర్జీలున్నవారు వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. లక్షణాలు పెరిగితే సొంతంగా మందుల మోతాదు మార్చుకోకూడదు.

  • దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో బిగుతు వంటి సమస్యలు కొనసాగితే వైద్యులను సంప్రదించాలి. శ్వాస తీసుకోవడం తీవ్రంగా కష్టంగా ఉన్నప్పుడు, ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు తక్షణ వైద్యసాయం పొందాలి. వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్స్‌ వాడకూడదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్