రోజూ ఇంట్లో వండుకుని తినే ఆహారం కాకుండా రెస్టారెంట్లోనో, లేక రోడ్డు పక్కన హోటల్స్లోనో, లేక బండ్లపైనో దొరికేవాటిని తింటే ఆ ఆహారం జీర్ణమవ్వక కడుపునొప్పి వస్తుంది. ఇది సహజమే. దీనికి మందులకంటే ఇంటి చిట్కాలే బాగా పనిచేస్తాయి. త్వరగా కడుపునొప్పి తగ్గుతుంది.
- ఆహారం అరగక తేలికపాటి కడుపునొప్పివస్తే వెంటనే యాపిల్ పండును కానీ, బేరిపండును కానీ పది పదిహేను నిమిషాలు ఉడికించి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. యాపిల్ ను ఇష్టపడనివారు ఉడికించకుండానే అరటిపండును తినొచ్చు.
- పెరుగు లేదా ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగితే తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
- గంజిలో ఉప్పు, మిరియాల పొడి కలుపుకొని తాగాలి. ఇలా ఇష్టపడనివారు గంజిని పప్పు, కిచిడి కాంబినేషన్ తో తినొచ్చు. మీకిష్టమైతే ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని తినొచ్చు. ఎక్కువగా రైస్ కాకుండా ఇలా తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. మిరియాల పొడి వల్ల త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం వల్ల కడుపునొప్పి వచ్చినా త్వరగా తగ్గుతుంది.
ఇంట్లో దొరికే వాటితో కడుపునొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వారి సలహా మేరకే మందులు వాడాలి.







కామెంట్‌లు (0)