మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూరగాయలను శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్త.!

20 గంటల క్రితం

కూరగాయలను శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్త! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 03:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

చలికాలంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అయితే వాటిని వండే ముందు సరిగా శుభ్రం చేయకపోతే వాటిపై ఉండే మట్టి, దుమ్ము, క్రిములు, ఇతర కలుషిత పదార్థాలు మన శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. ఈ కాలంలో ఎక్కువగా ఉపయోగించే ఐదు రకాల కూరగాయలను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం.

​పాలకూర : పాలకూరలో ఐరన్‌, పీచు పదార్థం, విటమిన్‌ ఎ, విటమిన్‌ కె సమృద్ధిగా ఉంటాయి. ఇది నేలకు దగ్గరగా పెరుగుతుంది కాబట్టి ఆకులకు మట్టి, దుమ్ము, ఇతర కలుషిత పదార్థాలు అంటుకునే అవకాశం ఎక్కువ. సరిగా శుభ్రం చేయని పాలకూరలో ఈ.కోలి వంటి బ్యాక్టీరియా, పరాన్నజీవుల గుడ్లు ఉండవచ్చు. అందువల్ల పాలకూర ఆకులను విడివిడిగా చేసి శుభ్రమైన నీటితో బాగా కడగాలి. అనంతరం పూర్తిగా ఉడికించి తినాలి. కడగని పాలకూరను పచ్చిగా తినకూడదు.

​క్యాప్సికం : క్యాప్సికం లోపలి భాగంలో, ముఖ్యంగా గింజల చుట్టూ మట్టి, ఇతర కలుషిత పదార్థాలు పేరుకుపోయే అవకాశం ఉంది. వంటకు ఉపయోగించే ముందు క్యాప్సికంను రెండు ముక్కలుగా కోసి, లోపల ఉండే గింజలను తొలగించాలి. ఆ తర్వాత లోపలి భాగాన్ని కూడా నీటితో బాగా శుభ్రం చేయాలి. సలాడ్లలో పచ్చిగా ఉపయోగించినా ఇదే జాగ్రత్త పాటించాలి.

​క్యాబేజీ : క్యాబేజీని సలాడ్లలోనూ, కూరగానూ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ఆకులు దగ్గరదగ్గరగా గట్టిగా చుట్టుకుని ఉండటంతో వాటి మధ్య మట్టి, సూక్ష్మజీవులు చిక్కుకుపోయే అవకాశం ఉంది. ముందుగా పైభాగంలోని ఆకులను తొలగించాలి. మిగిలిన ఆకులను విడదీసి ఒక్కొక్కటిగా శుభ్రంగా కడగాలి. వీలైనంత వరకు బాగా ఉడికించిన తర్వాతే తినాలి.

​వంకాయ : వంకాయను కోసేటప్పుడు లోపలి భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్నిసార్లు పురుగులు లోపల ఉండవచ్చు. పురుగు పట్టిన భాగం కనిపిస్తే దాన్ని ఉపయోగించకూడదు. ఎక్కువగా పురుగులు పట్టిన వంకాయలను పూర్తిగా పారవేయాలి. వంటకు ముందు శుభ్రమైన నీటితో బాగా కడగాలి.

​కాలీఫ్లవర్ : కాలీఫ్లవర్ బయటకు శుభ్రంగా కనిపించినప్పటికీ దాని పువ్వుల మధ్య చిన్న పురుగులు, మట్టి ఉండవచ్చు. అందుకే కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా విడదీసి బాగా కడగాలి. అనంతరం పూర్తిగా ఉడికించి తినాలి.

ఆకుకూరలను ఎలా కడగాలి?

​ఆకుకూరలను ముందుగా ముక్కలుగా కోయకుండా పెద్ద ఆకులుగా విడదీయాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని ఆకులను అందులో వేసి బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల ఆకులకు అంటుకున్న ఇసుక, మట్టి గిన్నె అడుగున చేరతాయి. ఆ తర్వాత ఆకులను పైకి తీసి మరోసారి శుభ్రమైన ప్రవహించే నీటితో కడగాలి. వీలైనంత వరకు కూరగాయలను కోయడానికి ముందే శుభ్రం చేసుకోవాలి. ​గోరువెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు చెంచాల ఉప్పు లేదా కొద్దిగా వెనిగర్ కలిపి కూరగాయలను 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత సాధారణ శుభ్రమైన నీటితో మరోసారి కడగాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్