మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌-ఇండోనేషియా సంబంధాల్లో స్వర్ణ అధ్యాయం

1 గంట క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 12:23 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం

- మోడీ విధానాలు కాపీ కొట్టా : ప్రబోవో సుబియాంటో

- బ్రహ్మోస్ క్షిపణులతో సహా పలు ఒప్పందాలు

​ జకార్తా : ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలు 'స్వర్ణ అధ్యాయం' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆ దేశ పర్యటనలో భాగంగా ఇండోనేషియా అత్యున్నత పురస్కారం ‘బంటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ మెడల్‌ను ప్రధాని మోడీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జకార్తా పార్లమెంట్‌‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ‘‘ ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని అందుకునే అదృష్టం నాకు దక్కింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. భారతీయ సమాజ స్నేహితులైన మీ అందరికీ ఇది దక్కిన గౌరవం. ఈ పురస్కారం ఇండోనేషియా, భారతదేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహానికి మరో ప్రతీక’’ అని అన్నారు. రామాయణ కాలం నుండి ఇరు దేశాల మధ్య సంబంధాలున్నాయన్నారు.

నాది భారత డిఎన్‌ఎ: ప్రబోవో

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మాట్లాడుతూ, ‘‘నేను భారతదేశంలో నా అధికారిక పర్యటనకు రావడానికి కొద్ది రోజుల ముందు, జీనోమ్ సీక్వెన్సింగ్ అనే పరీక్ష చేయించుకున్నాను. నా డిఎన్ఎని పరీక్షించుకోగా, నాది భారతీయ డిఎన్ఎ అని తెలిసింది. అందుకే నేను సంగీతం, ముఖ్యంగా భారతీయ సంగీతం విన్నప్పు డల్లా నా శరీరం కదులుతున్నట్లు అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. తను భారత్‌‌కు స్నేహితుడిని అని, అధ్యక్షుడు కాకముందే, మోడీ విధానాలను అధ్యయనం చేశానన్నారు. ఆయన చేసిన విధానాలను కాపీ కొట్టానని చెప్పారు. ఇండోనేషియన్లు భారతదేశ అనుభవం నుండి తప్పక నేర్చుకోవాలని, నాగరికత, సంస్కృతి భారత నాగరికతచే బలంగా ప్రభావితమయ్యాయని, ఇండోనేషియా భాష సుమారు 50 శాతం సంస్కృతం నుండి వచ్చిందన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలలో బ్రహ్మోస్, ఆస్ట్రా క్షిపణులను ఇండోనేషియాకు సరఫరా చేయడం, సముద్ర భద్రతను పెంపొందించడం, కీలక ఖనిజాల సరఫరా గొలుసులను బలోపేతం చేయడం వంటి ఒప్పందాలు జరిగాయని తెలుస్తోంది.

ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులు..

రెండు దేశాలు కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఔషధాలు, సముద్ర భద్రతతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని గణనీయంగా పెంచడానికి దాదాపు డజను ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులను సరఫరా చేయడంతో పాటు, ఆపరేషన్ సింధూర్ సమయంలో విజయవంతమైన ఆస్ట్రా ఎయిర్- టు- ఎయిర్ క్షిపణులను కూడా ఇండోనేషియా దిగుమతి చేసుకోనుంది. ఎఐ, టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో యువత మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరింది.అలాగే, రెండు దేశాల మధ్య స్టార్టప్ సహకారాన్ని మరింతగా పెంచడానికి అంగీకరించారు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, ఐఐఎం బెంగళూరు క్యాంపస్‌ను ఇండోనేషియాలో ఏర్పాటు చేయనున్నారు. ఇది మొత్తం ఆసియాన్ ప్రాంతంలోని యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. యుపిఐని ఇండోనేషియా చెల్లింపు వ్యవస్థతో అనుసంధానించేందుకు భారత్‌ అంగీకరించింది. 2022లో ఇండోనేషియా జి20 ప్రెసిడెన్సీ, 2023లో భారతదేశం జి20 ప్రెసిడెన్సీ రెండూ గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను ప్రపంచ ఎజెండా కేంద్రానికి తీసుకురావడానికి ప్రయత్నించాయి. భవిష్యత్తులో కూడా ఈ దిశగా భారత్, ఇండోనేషియా కలిసి పనిచేయనున్నాయి.

రెండు దేశాల ఏర్పాటే పాలస్తీనా సమస్యకు పరిష్కారం..​

ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు భారత్ మాకు మంచి మితృడని, మా చర్యలకు మోడీ సపోర్టు ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ఇండోనేషియాలో ఈ వివాదాన్ని లేవనెత్తారు. పాలస్తీనా సమస్యకు సంబంధించి భారతదేశం రెండు దేశాల పరిష్కారాన్ని సమర్థిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. చర్చలు, దౌత్యంతో గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకమైనవని భారతదేశం విశ్వసిస్తుందని ఆయన అన్నారు. భారత్, ఇండోనేషియా చరిత్ర, సంస్కృతి, శతాబ్దాలుగా స్థాపించిన ప్రజల మధ్య సంబంధాల ద్వారా అనుసంధానమై ఉన్నాయని ప్రధాని మోడీ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్