ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సౌదీతో కలిసి పనిచేసే యోచనలో ట్రంప్

11 అక్టోబర్, 2026

trumnp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 10:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్: ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలకు, సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమికి మధ్య పోరు తీవ్రం కావడంతో, హౌతీలపై సైనిక చర్యలో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియాతో కలిసి చర్యలు చేపట్టే విషయంపై ఆలోచిస్తున్నామని, అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌.. హౌతీల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామంపై సౌదీ యువరాజుతో త్వరలో చర్చిస్తానని తెలిపారు. ఈ దాడి గురించి తనకు ఇప్పుడే తెలిసిందని, పరిస్థితులను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇరాన్‌ అమెరికాలో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే తక్షణమే స్పందిస్తామని ట్రంప్‌ గతంలో హెచ్చరించారు. నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్