శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌‌పై ఇక ఆర్థిక యుద్ధం : ట్రంప్‌

1 రోజు క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 02:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : ఇరాన్‌‌పై అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆపరేషన్‌‌ చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌ప్రకటించారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగించడానికి ఉద్దేశించిన చర్చల విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఇరాన్‌‌పై ఇక తాము ఆర్థిక యుద్ధం చేస్తామన్నారు. ఈ మేరకు బుధవారం ట్రూత్‌ ‌సోషల్‌‌లో పోస్టు పెట్టారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ఇరాన్‌ ‌ఘోరంగా విఫలమైందని అన్నారు.ఇందుకు గానూ ఇరాన్‌ను అనూహ్యమైన రీతిలో ఏకాకిగా చేస్తామన్నారు. ఆర్థిక ఆంక్షలు ముమ్మరం చేస్తామన్నారు. ఇరాన్‌‌తో వ్యాపారం చేసే ఏదేశమైనా ఆంక్షలను ఎదుర్కొనక తప్పదని అన్నారు. ఇరాన్‌‌కు ఏ రకంగానైనా సాయం చేయడానికి ముందుకువచ్చే ఆర్థిక సంస్థలు, వ్యాపార కేంద్రాలు, విమానాశ్రయాలు, లేదా ప్రభుత్వ సంస్థలు అత్యంత తీవ్రమైన స్థాయిలో ఆర్థిక పర్యవసానాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. చమురు అక్రమ రవాణా, నగదు బదిలీలు, ఇళ్ళ మార్పిడులు, నౌకల రిజిస్ట్రీలు, ఫ్రంట్‌ ‌కంపెనీలు ఇవన్నీ కూడా తక్షణమే నిలిచిపోవాలి. ఇది ఎకనామిక్‌ ‌డి-డే. ఇరాన్ ముప్పను తిప్పి కొట్టేందుకు, ఏకాకిని చేసి, ఓడించేందుకు మిత్రపక్షాలు అమెరికాకు సహకరించాల్సిన అవసరం వుందన్నారు. ఇలా ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌‌ను బెదిరించడం ట్రంప్‌‌కు కొత్తేమీ కాదు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్