బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంధన కొనుగోళ్లు పెంచండి

21 అక్టోబర్, 2026

creue
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 10:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ​భారత్‌ను కోరిన రుబియో

  • ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారవుతుందని వ్యాఖ్య

  • జామ్‌నగర్‌లో రిలయన్స్ రిఫైనరీని సందర్శించిన అమెరికా వాణిజ్య మంత్రి

ముంబయి : ఇంధన, రక్షణ రంగాల్లో సహకరించుకునేందుకు భారత్, అమెరికా సంసిద్ధత వ్యక్తం చేశాయి. వాషింగ్టన్ నుంచి ఇంధన కొనుగోళ్లను పెంచుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్‌ను కోరారు. అమెరికా అనుసరిస్తున్న అనూహ్య వాణిజ్య విధానాలు, కఠినతరం అవుతున్న వలస నిబంధనల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశంలో పర్యటిస్తున్న రుబియో మంగళవారం ముంబయిలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయనతో విస్త త చర్చలు జరిపారు. గత ఐదు నెలల వ్యవధిలో రుబియో మన దేశంలో పర్యటించడం ఇది రెండోసారి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారవుతుందని రుబియో తెలిపారు.

అమెరికాలో నవంబరులో మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఇంధన సరఫరాలను పెంచడానికి, తద్వారా ధరలపై ఒత్తిడిని తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రుబియో తన తొలి రోజు పర్యటనలో జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఆయనతోపాటు యుఎఇ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రుబియో మధ్య త్రైపాక్షిక సమావేశం కూడా జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీని సందర్శించడానికి జామ్‌నగర్ వెళ్లడానికి ముందు రుబియో అదానీ గ్రూప్ చైర్మెన్ గౌతమ్ అదానీ, టాటా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ అధికారి (సీఈఓ) ఎన్.చంద్రశేఖరన్‌లతో సమావేశమయ్యారు. అదానీపై అభియోగాలను అమెరికా న్యాయ శాఖ ఉపసంహరించుకోవడం, ఓ క్రిమినల్ కేసును యుఎస్ ఫెడరల్ జడ్జి ఒకరు కొట్టివేయడం వంటి పరిణామాల తర్వాత అదానీతో మొదటిసారి రుబియో భేటీ అయ్యారు. రుబియో బుధవారం జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. రాత్రి జామ్‌నగర్‌లోనే బస చేసిన రుబియో గురువారం ఉదయం తిరిగి ముంబయి చేరుకుంటారు.

రుబియో, జైశంకర్ మధ్య ముంబయిలో జరిగిన సమావేశంలో ఇంధనం ప్రధానాంశంగా నిలిచింది. సమావేశం అనంతరం అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం... అమెరికాతో ఇంధన వాణిజ్యాన్ని పెంచుకోవడం ద్వారా భారత్ తన దేశీయ డిమాండును తీర్చుకుంటుందని, సరఫరా వ్యవస్థను విస్తరిస్తుందని రుబియో చెప్పారు. ద్వైపాక్షిక రక్షణ, పౌర అణు రంగాలలో సహకారంపై సాధించిన పురోగతిని ఆయన స్వాగతించారు. భారత్ మరింతగా అమెరికా సాంకేతికపరిజ్ఞానాన్ని, రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. జైశంకర్‌తో సమావేశానికి ముందు రుబియో విలేకరులతో మాట్లాడుతూ భారత్ తన ఇంధన పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడంలో గణనీయమైన పురోగతి సాధించిందని, ఇది తమకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. భారత్ ఇంధన అవసరాలలో కొంత భాగాన్ని అమెరికా తీరుస్తుందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్