శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నైజీరియాలో సైనిక విమానం కూలి 32 మంది మృతి

06 అక్టోబర్, 2026

HT5u3ilXgAAYaRn.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 09:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అబుజా: నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న నైజీరియా వైమానిక దళానికి చెందిన ఏటీఆర్‌-42 విమానం కుప్పకూలడంతో 32 మంది మృతి చెందారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధ్యక్షుడు బోలా టినుబు ప్రకటించారు. సైనిక విమానం సోమవారం బెనిన్‌ సిటీ నుంచి లాగోస్‌కు సాధారణ మిషన్‌లో భాగంగా బయలుదేరింది. ఉదయం 8.13 గంటలకు విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లకు సంబంధాలు తెగిపోయాయి. అనంతరం గాలింపు చేపట్టగా ఒండో రాష్ట్రంలోని తీర ప్రాంత పట్టణం ఇగ్బోకొడా సమీపంలో విమాన శకలాలను గుర్తించారు. చిత్తడి నేలలో విమానం కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. స్థానికులు పడవల్లో వెళ్లి సహాయక బృందాలకు సహకరించారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధ్యక్షుడు టినుబు ఆదేశించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్