మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అఫ్గానిస్థాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

22 గంటల క్రితం

earth quke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 08:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అఫ్గానిస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:36 గంటలకు భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం, భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా నమోదైంది. NCS సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం భూమికి 130 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీని భౌగోళిక స్థానం 36.114° ఉత్తర అక్షాంశం, 70.820° తూర్పు రేఖాంశంగా నమోదైంది. భూకంప కేంద్రం చాలా లోతులో ఉండటంతో ప్రకంపనల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై ప్రస్తుతం ఎలాంటి అదనపు వివరాలు వెల్లడించలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్