బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూలిన అణ్వాయుధ సామర్థ్యం గల బాంబర్‌ - ఆరుగురు మృతి

1 గంట క్రితం

russia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 11:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మాస్కో: తూర్పు రష్యాలో శిక్షణా విమానయానం సందర్భంగా అణ్వాయుధ సామర్థ్యం గల టుపోలెవ్‌ టియు-95 బాంబర్‌ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సైనికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అముర్‌ ప్రాంతంలో విమానం కూలిన సమయంలో, దాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతం వైపు మళ్లించినట్లు వెల్లడించారు. దీంతో జనావాసాల్లో భారీ ప్రమాదం తప్పినట్లు పేర్కొన్నారు. విమానంలో ఉన్న పైలట్‌ ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు లేవని స్పష్టం చేశారు. టియు-95ను రష్యా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి వినియోగిస్తోంది. నాలుగు ఇంజిన్లతో కూడిన ఈ వ్యూహాత్మక టర్బోప్రాప్‌ బాంబర్‌ సుదూర ప్రయాణ క్రూయిజ్‌ క్షిపణులను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్