శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

X Post - అమెరికాలోని హిందూ ఆలయంపై దాడి

03 అక్టోబర్, 2026

Attack on a Hindu temple in the US
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూయార్క్ : అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఉన్న ఓ హిందూ ఆల‌యం పై దాడి జ‌రిగింది. ఆ ఆల‌యంపై ఇటుక‌ల‌తో అటాక్ చేసిన‌ట్లు హిందూ అమెరిక‌న్ ఫౌండేష‌న్ పేర్కొన్న‌ది. రిచ్‌మండ్ హైయిట్స్‌లో ఉన్న శ్రీ స్వామినారాయ‌ణ్ వ‌డ్త‌ల్ ధామ్ హిందూ మందిర్‌పై దాడి జ‌రిగిన‌ట్లు త‌న ఎక్స్ అకౌంట్‌లో ఆ ఫౌండేష‌న్ తెలిపింది. ఇటుక‌ల‌తో దాడి చేయ‌డం వ‌ల్ల ఆల‌యం డ్యామేజ్ జ‌రిగింది. ఆల‌యం స‌మీపంలో ఉన్న నిఘా వీడియోను ప‌రిశీలిస్తున్నామ‌ని అధికారులు చెప్పారు. గుడి పెద్ద‌ల‌తో టచ్‌లో ఉన్న‌ట్లు ఫౌండేష‌న్ పేర్కొన్న‌ది. గుడిలో పూజారులు, యాత్రికులు ఉన్న స‌మ‌యంలోనే ఇటుక‌ల‌తో దాడి జ‌రిగిన‌ట్లు తెలిసింది. అయితే ఆ దాడిలో ఆల‌యంలోని కిటికీలు దెబ్బ‌తిన్నాయి.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్