బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాకు పారిపోయిన ప్లావియో బోల్సోనారో

1 గంట క్రితం

Flavio Bolsonaro
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 12:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బ్రసీలియా : బ్రెజిల్‌ సెనెటర్‌ ఫ్లావియో బోల్సోనారో దేశం విడిచి అమెరికాకు పారిపోయినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా పాస్‌పోర్టులు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, ఆయన ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం నాటికి పాస్‌పోర్టులు అప్పగించాలన్న గడువు ముగియడంతో అధికారులు సంబంధిత పత్రాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లావియో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అధికారికంగా ఓటమిని అంగీకరించలేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఫలితాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, ఆయనకు చెందిన లిబరల్‌ పార్టీ సోమవారం అధ్యక్షుడు లూలా విజయాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై బ్రెజిల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించలేదు. ఫ్లావియో తరఫు న్యాయవాది కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన అమెరికాలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు అక్కడికి చేరుకుంటారు? రాజకీయ ఆశ్రయం కోరుతున్నారా? అనే అంశాలపై స్పష్టత లేదు. సాధారణ వలస మార్గం ద్వారా జైర్‌ బోల్సోనారో దేశం విడిచి వెళ్లలేదని బ్రెజిల్‌ ఫెడరల్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


2022 అధ్యక్ష ఎన్నికల్లో లూలా విజయాన్ని అంగీకరించడానికి నిరాకరించిన జైర్‌ బోల్సోనారో కూడా అమెరికాకు వెళ్లారు. అనంతరం బ్రెజిల్‌కు తిరిగి వచ్చారు. అయితే, బ్రసీలియాలోని ప్రభుత్వ భవనాలపై ఆయన మద్దతుదారులు దాడులకు పాల్పడిన ఘటనపై తిరుగుబాటుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బోల్సోనారో కుటుంబానికి అనధికారిక ప్రతినిధిగా వ్యవహరించే మితవాద ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాలో ఫిగ్యురెడో సైతం ఫ్లావియో ఆచూకీపై ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్