ఇంటర్నెట్ : టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌తో తన బంధం ముగిసిందని టెక్ ఎగ్జిక్యూటివ్ శివాన్ జిలిస్ వెల్లడించారు. ‘ఎక్స్’ వేదికగా ఆమె చేసిన ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మస్క్ ఈ సంబంధానికి ముగింపు పలికారని ఆమె పేర్కొన్నారు.
‘‘వారం రోజుల వ్యవధిలో ప్రేమ నుంచి వీడ్కోలు వరకు రావడం చాలా కష్టం. కానీ కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది’’ అని జిలిస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామం తనను తీవ్రంగా బాధించిందని, అయినప్పటికీ మస్క్‌పై తన ప్రేమ తగ్గలేదని తెలిపారు. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మస్క్‌తో ఇటీవల జరిగిన టెక్స్ట్ సంభాషణల స్క్రీన్షాట్లను కూడా జిలిస్ పంచుకున్నారు. సెప్టెంబర్ 24న ఆమె ‘‘లవ్ యూ వెరీ మచ్’’ అని చెప్పగా.. మస్క్ ‘‘లవ్ యూ టూ’’ అని బదులిచ్చారు. ఈ సంభాషణ జరిగిన కొద్ది రోజులకే వారి బంధం ముగియడం గమనార్హం.
మస్క్ జీవితంలో తమ కుటుంబం ప్రశాంతత, ప్రేమకు నిలయంగా ఉండేదని జిలిస్ పేర్కొన్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆయన తమ వద్ద మద్దతు పొందేవారని తెలిపారు. మస్క్, జిలిస్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో కవలలు స్ట్రైడర్, అజూర్, 2024లో ఆర్కాడియా, 2025లో సెల్డన్ జన్మించారు. పిల్లల కోసం ఇకపై కూడా మంచి స్నేహితులుగా, మంచి తల్లిదండ్రులుగా కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.








కామెంట్లు (0)