శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

థర్డ్ డిగ్రీ వాడకుండా ఆదేశాలివ్వండి : కోర్టుకు సిఐ నాగరాజు అభ్యర్థన

2 గంటల క్రితం

థర్డ్ డిగ్రీ వాడకుండా ఆదేశాలివ్వండి : కోర్టుకు సిఐ నాగరాజు అభ్యర్థన
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 02:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : తనపై థర్డ్ డిగ్రీ వాడకుండా ఆదేశాలివ్వాలని కోర్టును సిఐ నాగరాజు అభ్యర్థించారు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ (లాకప్ డెత్) వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సిఐ నాగరాజు కేసులో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు విజయవాడ కోర్టు నాగరాజును 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ... సిఐ నాగరాజు న్యాయస్థానానికి ఒక సంచలన లేఖ రాశారు. సాయికృష్ణ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు కావాలనే తప్పుడు ఆధారాలను సృష్టించి ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని నాగరాజు ఆరోపించారు. ఎనిమిది రోజుల కస్టడీ విచారణ సమయంలో అధికారులు తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా, శారీరకంగా, మానసికంగా వేధించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును వేడుకున్నారు. అంతేకాకుండా, సిట్ అధికారులు జరిపే విచారణ ప్రక్రియ అంతా చట్ట ప్రకారం తన న్యాయవాదుల సమక్షంలోనే జరిగేలా చూడాలని లేఖలో అభ్యర్థించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్