బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరోదసీలోకి చైనా అంతరిక్ష నౌక

-4 నిమిషాల క్రితం

ముగ్గురు వ్యోమగాములతో
రోదసీలోకి చైనా అంతరిక్ష నౌక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 12:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌ : ముగ్గురు వ్యోమగాములను తీసుకెళుతున్న మానవ సహిత షెంజూ-24 వ్యోమనౌకను చైనా బుధవారం విజయవంతం గా ప్రయోగించింది. ఈ ముగ్గురిలో ఒకరైన పాకిస్తానీ జాతీయుడు మహ్మద్‌ ‌జీషన్‌ అలీ చైనా మానవ సహిత రోదసీ కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి విదేశీయుడు. మిషన్‌ ‌కమాండర్‌ ‌టాంగ్‌ ‌హాంగ్‌‌బో, ఫ్లైట్‌ ఇంజనీర్‌ ‌వూయిలు చైనీయులే. ఈ రోదసీ నౌకను తీసుకువెళుతున్న లాంగ్‌ ‌మార్చ్‌-2ఎఫ్‌ ‌రాకెట్‌ ‌వాయవ్య చైనాలోని జియాక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి నింగికెగసింది. రోదసీలోని చైనా అంతరిక్ష స్టేషన్‌ ‌తియాన్‌‌గాంగ్‌‌లోకి వ్యోమగాములు ముగ్గురు విజయవంతంగా ప్రవేశించారు. పేలోడ్‌ ‌నిపుణుడిగా అలీ పేరొందారు. ఈ రోదసీ ప్రయాణంతో ఆయన చైనా నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి విదేశీ వ్యోమగామిగా రికార్డులకెక్కారు. బీజింగ్‌ ‌కాలమానం ప్రకారం..బుధవారం ఉదయం 8.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన షెంజూ 24 మధ్యాహ్నం 2.35 గంటలకు స్పేస్‌ ‌స్టేషన్ చేరుకున్నట్లు చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ (సిఎంఎస్‌ఎ) తెలిపింది. మహ్మద్‌ ‌జీషన్‌ అలీ వారం రోజులు రోదసీలో వుండి తిరిగి ఆ వ్యోమ నౌకలోనే భూమికి తిరిగివస్తారు. గతేడాది ఫిబ్రవరిలో చైనా, పాకిస్తాన్‌‌ల మధ్య రోదసీ సహకార ఒప్పందంపై సంతకాలు జరిగన నేపథ్యంలో అలీ ఇందులో వెళుతున్నారు. మొత్తంగా 90కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు, సాంకేతిక పరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. అంతరిక్ష జీవ శాస్త్రాలు, పదార్ధ విజ్ఞానం, సూక్ష్మ గురుత్వాకర్షణ భౌతిక శాస్త్రం, అంతరిక్ష ఔషధాలు, ఇతర రంగాల్లో ఈ పరీక్షలు, ప్రయోగాలు వుంటాయి. ఈ మిషన్‌‌ను దేశానికి గర్వ కారణంగా పాకిస్తాన్‌ ‌ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌వ్యాఖ్యానించారు. యువతకు ఇది స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. చైనా రోదసీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినందుకు చైనాకు కృతజ్ఞతలు తెలియచేశారు. పాక్‌ ‌రోదసీ కార్యక్రమంలో ఇదొక నూతన అధ్యాయమని పాక్‌ ‌ప్రణాళికా శాఖ మంత్రి వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్