బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపర్యావరణ పరిరక్షణకు ఆదివాసీ మహిళల కృషి

-10 నిమిషాల క్రితం

సుస్ధిరాభివృద్ధి..పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీ మహిళల కృషి
- బ్రసీలియాలో అమెజాన్‌ దేశాల ఆదివాసీ మహిళల చర్చలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 12:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బ్రసీలియాలో అమెజాన్‌ దేశాల ఆదివాసీ మహిళల చర్చలు

బ్రసీలియా : భూగోళ ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్‌ అటవీప్రాంత సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని మరింత బలోపేతం చేయాల్సివుందని ఆదివాసీ తెగలకు చెందిన పలువురు మహిళా నేతలు ప్రతీనబూనారు. ఈ నెల 24 నుండి 26 వరకు బ్రసీలియాలో అమెజాన్‌ ఆదివాసీ మహిళల నాల్గవ సమావేశం జరుగుతోంది. కన్జర్వేషన్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. బ్రెజిల్‌‌లో ఇటువంటి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. బ్రెజిల్‌, కొలంబియా, పెరూ, ఈక్వెడార్‌, బొలీవియా దేశాల నుండి 38 మంది మహిళా నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఆదివాసీ మహిళల ఆర్థిక స్వేచ్ఛను, పర్యావరణ పరిరక్షణను, నిర్ణయాక క్రమంలో ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు నెట్‌‌వర్క్‌‌లను నిర్మించడంలో అనుభవాలను వారు పరస్పరం పంచుకుంటున్నారు. సుస్థిర నిర్వహణ, ప్రాదేశిక గుర్తింపు, బిజినెస్‌ ‌లేదా నెట్‌‌వర్క్‌ ‌కార్యకలాపాలు (వాల్యూ చెయిన్స్‌), మార్కెట్‌ ‌సౌలభ్యత వంటి అంశాలకు సంబంధించి కూటములను నిర్మించుకోవడంపై మాట్లాడుకున్నారు. మొత్తంగా మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడంపైన వారు దృష్టి పెట్టారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సాంప్రదాయ కళాకృతులను తయారుచేయడానికి కీలకమైన వనరైన తాటి పీచుకు ఎదురవుతున్న సవాళ్ళను బ్రెజిల్‌ ‌నేత ఏంజెలా జబోటి ప్రముఖంగా ప్రస్తావించారు. కొలంబియా నేత జెనీ జాజ్‌‌మిన్‌ ‌మాట్లాడుతూ, దేశీయ ‌నాయకత్వ నెట్‌‌వర్క్‌ ప్రాముఖ్యత, పర్యావరణ దౌత్యం గురించి నొక్కి చెప్పారు.

దేశీయ విజ్ఞాన వ్యవస్థను, విద్యను, ఆదివాసీల భాషలు, వారి గుర్తింపులు, సాంప్రదాయాలను గుర్తించాలని సమావేశంలో పాల్గొంటున్న ప్రతినిధులు డిమాండ్‌ ‌చేశారు.

మరోవైపు కొలంబియాలో జీవితాన్ని నిలబెట్టే విజ్ఞానం అనే శీర్షికతో సమాంతరంగా మరో సమావేశం జరుగుతోంది. జీవ ఆర్థిక వ్యవస్థ, కమ్యూనిటీ స్వయంప్రతిపత్తి, అమెజాన్‌ ‌పరిరక్షణ చర్యలను బలోపేతం చేసేందుకు ఆదివాసీ మహిళల మధ్య సహకారాన్ని పెంపొందించాలన్నది ఈ సమావేశం లక్ష్యంగా వుంది. అదే సమయంలో వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంపైనా చర్చించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్